Saturday, November 15, 2025
Homeకెరీర్RRB Group D: ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డి ఎగ్జామ్‌ షెడ్యూల్‌ రిలీజ్‌.. ఏ ఏ...

RRB Group D: ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డి ఎగ్జామ్‌ షెడ్యూల్‌ రిలీజ్‌.. ఏ ఏ తేదీల్లో పరీక్షలంటే?

RRB Group D Exam Schedule Release: రైల్వే కొలువులంటే యువతలో ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. ఆకర్షనీయమైన వేతనాలు, అనేక సౌకర్యాలు రైల్వే కొలువుల సొంతం. అందుకే, యువత కలను సాకారం చేసేందుకు ఆర్‌ఆర్‌బీ ఏటా క్రమం తప్పకుండా జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ తాజాగా గ్రూప్‌ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. మీరు కూడా ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ పరీక్షకు దరఖాస్తు చేశారా? అయితే, ఈ సమాచారాన్ని పక్కాగా తెలుసుకోవాల్సిందే..

- Advertisement -

నవంబర్‌ 17 నుంచి పరీక్షలు..

ఆర్‌ఆర్‌బీ తాజా షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్‌ డీ పరీక్షను ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలను నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆర్‌ఆర్‌బీ నిర్వహించనుంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్‌ డి లెవల్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. కాగా, ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యింది. ఆర్‌ఆర్‌బీ ఎగ్జామ్‌ తేదీకి వారం రోజుల ముందుగా సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేయనుంది. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. అభ్యర్ధులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది. కాగా, ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆర్‌ఆర్‌బీ దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్‌- డీ ఖాళీలను భర్తీ చేయనుంది. దీనిలో అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ తదితర ఖాళీలు ఉన్నాయి. బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, అహ్మదాబాద్, భువనేశ్వర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, రాంచీ, సికింద్రాబాద్ తదితర రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎంపిక ప్రక్రియ ఇదే..

ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు ముందుగా ఎగ్జామ్‌ పాటర్న్‌ను అర్థం చేసుకోవాలి. పరీక్షలో ఏ ఏ అంశాలు ఉంటాయి? ఏ సబ్జెక్ట్‌కు ఎన్ని మార్కులు వస్తాయి? బ్లూ ప్రింట్‌ ఎలా ఉంటుంది? ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తాయి? అనే విషయాలు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌లో 100 ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలే. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. అనంతరం మెడికల్‌ టెస్ట్‌, చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad