RRB job calendar released Here the full Details: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారికి గుడ్‌న్యూస్. ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు రిలీజ్ చేసే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈసారి కూడా 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సమగ్రమైన వార్షిక క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీ చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లక్షలాది మంది యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఈ క్యాలెండర్ ప్రకారం.. 2026 ఫిబ్రవరి నెలలో అసిస్టెంట్ లోకోపైలట్ (ALP) పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం మార్చి నెలలో టెక్నీషియన్ విభాగాల్లో ఉన్న వేల సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ నెలలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ వరుస నోటిఫికేషన్లు రానుండడంతో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం ద్వితీయార్థంలో మరిన్ని కీలక నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. జులై నెలలో పారామెడికల్ స్టాఫ్‌తో పాటు జూనియర్ ఇంజనీర్ (జేఈ) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. రైల్వేలో అత్యంత క్రేజ్ ఉన్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్‌టీపీసీ) నోటిఫికేషన్ ఆగస్టులో వెలువడనుంది. ఇది డిగ్రీ, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. అనంతరం సెప్టెంబర్‌లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీ జరగనుంది. చివరిగా, అక్టోబర్ నెలలో భారీ స్థాయిలో అభ్యర్థులు ఎదురుచూసే గ్రూప్-డి (లెవల్-1) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/eatela-rajendar-sensational-comments-on-bandi-sanjay/
కిటకిటలాడనున్న కోటించ్ సెంటర్లు, స్టడీ హాళ్లు..
రైల్వే బోర్డు క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించడం వల్ల అభ్యర్థులకు తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే వెసులుబాటు కలిగింది. క్యాలెండర్‌కు అనుణంగా అభ్యర్థులు వారి ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. గతంలో నోటిఫికేషన్ల మధ్య అనిశ్చితి ఉండేద. కానీ ఇప్పుడు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత రావడంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే ఏకాగ్రతతో చదువుకోవచ్చు. రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ కీలకం కాబట్టి.. ఆయా అంశాలపై పట్టు సాధించడం అవసరం. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు ఎంతగానో మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ విడుదలతో కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్, నిరంతర సాధన ఉంటే, 2026లో రైల్వే ఉద్యోగం సాధించడం అసాధ్యమేమీ కాదు. అయితే, అంతకు తగ్గట్లు ప్రణాళికతో ముందుకెళ్లాడం ముఖ్యం.

