RRB NTPC 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025-26 సంవత్సరానికి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 21 RRB రీజియన్లలో మొత్తం 8,850 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు 5,800, అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు 3,050 ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ అర్హతతో యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ 21, 2025 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం. అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ 28 నుంచి దరఖాస్తులు.
చివరి తేదీలు: గ్రాడ్యుయేట్ నవంబర్ 20, అండర్‌గ్రాడ్యుయేట్ నవంబర్ 27.
గ్రాడ్యుయేట్ పోస్టులు : స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్.
అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులు: జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఈ పోస్టులు అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగచ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్మూ-శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫ్ఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం రీజియన్లలో ఉన్నాయి.
అర్హతలు : గ్రాడ్యుయేట్ పోస్టులకు ఏ డిగ్రీ అయినా ఉత్తీర్ణత, వయసు 18-33 సంవత్సరాలు. అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్, వయసు 18-30 సంవత్సరాలు. కొన్ని పోస్టులకు హిందీ/ఇంగ్లీష్ టైపింగ్ నైపుణ్యం అవసరం. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌కు వయోపరిమితి, ఫీజు రాయితీలు ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ – రూ.500 (రూ.400 రీఫండ్), ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/మహిళలు/ట్రాన్స్‌జెండర్/ఎక్స్-సర్వీస్‌మెన్ – రూ.250 (రూ.250 రీఫండ్). అప్లై చేయడానికి rrbcdg.gov.in లేదా ప్రతి RRB వెబ్‌సైట్‌లో వెళ్లాలి.
సెలక్షన్ ప్రక్రియ: CBT-1 (స్క్రీనింగ్), CBT-2 (మెయిన్), స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ (అర్హత పరీక్ష), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్. రాత పరీక్ష తేదీలు త్వరలో ప్రకటించనున్నారు. ఖాళీల వివరాలు CEN 06/2025 (గ్రాడ్యుయేట్), CEN 07/2025 (అండర్‌గ్రాడ్యుయేట్)లో అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశం రైల్వేలో స్థిరమైన ఉద్యోగాలు, మంచి జీతం, పెన్షన్‌తో ఆకర్షణీయంగా ఉన్నాయి. మరిన్ని వివరాలు అధికారిక సైట్‌లో చూడండి.


