Thursday, July 10, 2025
Homeకెరీర్RRB Notification 2025: రైల్వేలో 6, 238 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

RRB Notification 2025: రైల్వేలో 6, 238 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Railway Recruitment Board: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ ప్రకటనలో భాగంగా దేశవ్యాప్తంగా అన్నీ రీజియన్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో ఖాళీ ఉన్న టెక్నీసియన్ గ్రేడ్-1, గ్రేడ్ -3 పోస్టలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 6, 238 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 183 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు, 6,055 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

- Advertisement -

ఈ 6,238 జాబ్ ఖాళీలను సికింద్రాబాద్ సహా భోపాల్, బెంగళూరు, భువనేశ్వర్న, చండీగఢ్, చైన్నై, అజ్మేర్, అహ్మదాబాద్, జమ్ము అండ్ శ్రీనగర్, గుహవాటి, మాల్దా, ముంబై, కోల్‌కతా ముజఫర్ పూర్, పాట్నా, రాంచీ సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్ పూర్, ప్రయాగ్ రాజ్ రీజియన్లలో భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ అర్హులైన దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా -1,434
ఆర్‌ఆర్‌బీ చెన్నై -1,347
ఆర్‌ఆర్‌బీ ముంబయి – 891
ఆర్‌ఆర్‌బీ చండీగఢ్‌ -446
ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్‌ శ్రీనగర్‌ – 296
ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్‌ – 239
ఆర్‌ఆర్‌బీ భోపాల్‌ – 210
ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం – 197
ఆర్‌ఆర్‌బీ గువాహటి – 184
ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్‌ -174
ఆర్‌ఆర్‌బీ బెంగళూరు – 140
ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్‌లో -139
ఆర్‌ఆర్‌బీ సిలిగురి – 133
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ – 113
ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్‌ – 71
ఆర్‌ఆర్‌బీ మాల్దా -70
ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పుర్‌ – 68
ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్‌ -38
ఆర్‌ఆర్‌బీ రాంచీ – 35
ఆర్‌ఆర్‌బీ పట్నా – 07
ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్‌ – 02

విద్యార్హత: టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఎస్సీ, ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/బీఈ/ బీటెక్‌ లేదా ఫిజిక్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిప్లొమాలో పాసై ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ లేదా ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకాట్రానిక్స్‌/ మెకానిక్ డీజిల్‌/ మెకానిక్ మోటార్ వెహికిల్/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్‌ మెషిన్ టూల్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: జూలై 1, 2025 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు మధ్య ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఈనెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

వేతనం: ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ పోస్టులకు రూ.29 వేలు, గ్రేడ్ -3 పోస్టులకు రూ.19 వేల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు ఇవే:

ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 28, 2025 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 28
పరీక్ష ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జులై 30
దరఖాస్తు సవరణకు తేదీలు: ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అవకాశం

ఈ ఉద్యోగ అవకాశంపై మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆ ప్రాంతీయ RRB వెబ్‌సైట్లను కూడా సందర్శించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News