Sunday, November 16, 2025
Homeకెరీర్RRB NTPC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వేలో 8850 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్‌

RRB NTPC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వేలో 8850 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్‌

RRB Releases Notification for NTPC Posts: నిరుద్యోగులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వేల పరిధిలోని 8850 ఖాళీల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆర్‌ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్ www.rrbcdg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఎంపికైన అభ్యర్థులకు రూ. 35,400 బేసిక్‌ శాలరీతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయని తెలిపింది. నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. కాగా, ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవ్వగా.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 27లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష తేదీలను త్వరలోనే ఆర్‌ఆర్‌బీ అధికారికంగా ప్రకటించనుంది. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/gallery/benefits-of-sandalwood-face-pack/

ఏఏ పోస్టుల్లో ఉన్ని ఖాళీలు?

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 8,850 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే), చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియ్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ తదితర ఉద్యోగ ఖాళీలను నింపనుంది. కాగా, ఈ పోస్టులకు అక్టోబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 20న దరఖాస్తు గడువు ముగియనుంది. కాగా, డిగ్రీ క్వాలిఫికేషన్‌తో 5817 పోస్టులను భర్తీ చేయనుంది. దీనిలో స్టేషన్ మాస్టర్ 615 పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3423 పోస్టులు, ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే) 59 పోస్టులు, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ 161 పోస్టులు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921 పోస్టులు, సీనియ్ క్లర్క్ టైపిస్ట్ 638 పోస్టులున్నాయి. ఇక, ఇంటర్ క్వాలిఫికేషన్‌తో మొత్తం 3058 పోస్టులను భర్తీ చేయనుంది. దీనిలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394 పోస్టులు, ట్రైన్ క్లర్క్ 77 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2,424 పోస్టులను భర్తీ చేయనుంది.

వయోపరిమితి, దరఖాస్తు ఫీజు వివరాలు..

ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఇంటర్ అర్హత గల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్ల వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. మరోవైపు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad