Saturday, November 15, 2025
HomeTop StoriesSBI Asha Scholarship 2025: రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్‌.. పేద విద్యార్థులకు గోల్డెన్‌...

SBI Asha Scholarship 2025: రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్‌.. పేద విద్యార్థులకు గోల్డెన్‌ ఛాన్స్‌

SBI Asha Scholarship 2025 Notification: పేదింటి విద్యార్థులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గోల్డెన్‌ ఛాన్స్‌ తీసుకొచ్చింది. దీని విద్యార్థులు ఏటా రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్స్‌, వైద్య విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ విద్యార్థుల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్(SBI Foundation) ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌ల కోసం ఎస్‌బీఐ ప్రకటన వెలువరించింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/career-news/dsssb-assistant-teacher-jobs-1180-vacancies-2025/

చదువులో విశేష ప్రతిభను ప్రదర్శించే పేదింటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ‘ప్లాటినమ్‌ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్‌’ను ఎస్‌బీఐ ప్రకటించింది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా మొత్తం 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ స్కాలర్‌షిప్‌ల కోసం మొత్తం రూ. 90 కోట్లు కేటాయించింది. 2022 నుంచి వెనుకబడిన విద్యార్థుల కోసం ఆశా స్కాలర్‌షిప్‌లను ఎస్‌బీఐ ఫౌండేషన్‌ అందిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాదికి కూడా స్కాలర్‌షిప్‌ అందించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు.

ఆశా స్కాలర్‌షిప్‌నకు 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు చదివే పేదింటి విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 2024-25 విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని ప్రకటనలో పేర్కొంది. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 10 శాతం అంటే 67.5 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6.30 సాధించాల్సి ఉంటుందని తెలిపింది. ఇక విద్యార్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మించకుండా ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్‌ 15, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపింది.

Also Read: https://teluguprabha.net/career-news/telangana-green-energy-policy-to-generate-20000-mw-and-jobs/

ఇక ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులు తాము ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేలు నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని ఫౌండేషన్‌ అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులు ఏటా రెన్యువల్‌ కావాలంటే.. చదివే కోర్సుల్లో కనీస అర్హత ప్రమాణాలు అంటే అటెండెన్స్, ఉత్తీర్ణత మార్కులు వంటివి పాటించాల్సి ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad