Saturday, November 15, 2025
Homeకెరీర్SBI recruitment 2025 : SBIలో 6589 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. నేడే లాస్ట్...

SBI recruitment 2025 : SBIలో 6589 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. నేడే లాస్ట్ డేట్!

SBI recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్, జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల కోసం 6589 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు గడువు ఆగస్టు 26, 2025 కాబట్టి, ఆసక్తి ఉన్నవారు త్వరగా అప్లై చేయండి!

- Advertisement -

ALSO READ: Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9లోకి బాల‌కృష్ణ హీరోయిన్ – బుజ్జిగాడు బ్యూటీకి ఛాన్స్ – కామ‌న్‌మ్యాన్స్ టాప్ 15 కంటెస్టెంట్స్ వీళ్లే!

పోస్టులు & ఖాళీలు:

జూనియర్ అసోసియేట్: 6589 (రెగ్యులర్: 5180, బ్యాక్‌లాగ్: 1409)

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏ విభాగంలోనైనా డిగ్రీ. ఫైనల్ ఇయర్ విద్యార్థులు 2025 డిసెంబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేస్తే అర్హులు.

వయస్సు: 20-28 ఏళ్లు (01.04.2025 నాటికి). ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.24,050 నుంచి రూ.64,480, డీఏ, హెచ్‌ఆర్‌ఏతో సుమారు రూ.46,000.

ఎంపిక విధానం:

ప్రిలిమ్స్: 100 మార్కులు, 1 గంట

మెయిన్స్: 200 మార్కులు, 2 గంటల 40 నిమిషాలు

స్థానిక భాషా పరీక్ష: 10వ/12వ తరగతిలో భాష చదివిన రుజువు లేనివారికి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ.750; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: 06.08.2025

చివరి తేదీ: 26.08.2025

ప్రిలిమ్స్: సెప్టెంబర్ 2025

మెయిన్స్: నవంబర్ 2025

దరఖాస్తు విధానం: www.sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఫొటో (20-50 KB), సంతకం (10-20 KB), హ్యాండ్‌రిటెన్ డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.

కీలక సమాచారం:
ఒకే రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి దరఖాస్తు చేయాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంటర్-స్టేట్ బదిలీలు ఉండవు. స్థానిక భాషా నైపుణ్యం తప్పనిసరి. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను చెక్ చేయండి: SBI Careers.

ALSO READ : TPCC chief counters:బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్: ‘రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండండి’

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad