School holidays: ఫిబ్రవరి నెల విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయం. ఒకవైపు వార్షిక మరియు బోర్డు పరీక్షల సన్నాహాలు, మరోవైపు పలు పండుగలు, జాతీయ వేడుకల నేపథ్యంలో సెలవులు రానున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో పాఠశాలలు, కళాశాలలకు ఏయే తేదీల్లో సెలవులు ఉండే అవకాశం ఉందో ఓసారి పరిశీలిద్దాం.
ఆదివారాల రూపంలో తప్పిన అదనపు సెలవులు: ఈ ఏడాది కొన్ని కీలక పండుగలు ఆదివారం రావడంతో విద్యార్థులు అదనపు సెలవులను కోల్పోతున్నారు. ఫిబ్రవరి 1 (ఆదివారం)న సంత్ రవిదాస్ జయంతి. ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇది ప్రధాన పండుగ అయినప్పటికీ ఆదివారం కావడంతో ప్రత్యేక సెలవు లభించదు. ఫిబ్రవరి 15 (ఆదివారం)న మహాశివరాత్రి. దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ కూడా ఆదివారమే రావడంతో విద్యార్థులకు ఆ నిరాశ తప్పదు.
ఫిబ్రవరిలో కీలక సెలవుల జాబితా: రాష్ట్రాల వారీగా, స్థానిక పండుగలను బట్టి సెలవులను నిర్ణయించారు.ఫిబ్రవరి 18 (బుధవారం)న టిబెటన్ నూతన సంవత్సరం కారణంగా సిక్కిం మరియు ఆ ఏరియాలోని పర్వత ప్రాంతాల్లో సెలవును ప్రకటించారు. ఫిబ్రవరి 19 (గురువారం)న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని మహారాష్ట్ర మరియు పలు ఇతర రాష్ట్రాలు సెలవును ప్రకటించారు.
వరుస సెలవులకు ఛాన్స్!: మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి మూడవ వారంలో వరుస సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
- ఫిబ్రవరి 14: రెండో శనివారం (కొన్ని చోట్ల సెలవు)
- ఫిబ్రవరి 15: ఆదివారం (మహాశివరాత్రి)
- ఫిబ్రవరి 19: శివాజీ జయంతి. మహారాష్ట్రలో 19వ తేదీ గురువారం సెలవు ఉండటంతో, కొన్ని విద్యాసంస్థలు స్థానిక పరిస్థితులను బట్టి లాంగ్ వీకెండ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
విద్యార్థులకు సూచన: ఫిబ్రవరిలో బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ సెలవులను కేవలం విశ్రాంతికే పరిమితం చేయకుండా.. పరీక్షల ప్రిపరేషన్‌ను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ సెలవులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు మరియు స్థానిక విద్యాసంస్థల నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. కావున ఖచ్చితమైన సమాచారం కోసం మీ పాఠశాల లేదా కళాశాల క్యాలెండర్‌ను తనిఖీ చేసుకోగలరు.

