South Central Railway: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (SCR) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,012 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
- పాయింట్స్‌మన్
- ట్రాక్ మెయింటెయినర్
- అసిస్టెంట్ లోకో షెడ్
- అసిస్టెంట్ ఆపరేషన్స్
- వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టులు
అర్హతలు, దరఖాస్తు విధానం: రైల్వేలో ఉద్యోగం పొందాలనే ఆసక్తి కల్గిన అభ్యర్థులు పదో తరగతి (10th Class) తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 2 వరకు గడువు ఉంది.
Also read-Jobs: డిగ్రీ పాస్ అయితే చాలు..పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద జనరల్, ఈడబ్లూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500గా కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఈబీసీ, మాజీ సైనికోద్యోగులకు రూ. 250గా నిర్థారించారు.
ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు: అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)
- శారీరక సామర్థ్య పరీక్ష (PET)
- ధ్రువపత్రాల పరిశీలన (Document Verification)
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,000 నుండి రూ. 30,000 వరకు జీతభత్యాలు లభిస్తాయి. రాత పరీక్ష తేదీలను ఆర్‌ఆర్‌బీ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది.

