Saturday, November 15, 2025
Homeకెరీర్RRC Railway Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సర్కార్...

RRC Railway Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సర్కార్ కొలువు!

Sports Quota Recruitment In Eastern Railway: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఈస్టర్న్ రైల్వేలో 2025-26 సంవత్సరానికి సంబంధించి క్రీడా కోటా కింద ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద గ్రూప్ సీ, గ్రూప్ డీ విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్ధులు సెప్టెంబర్ 10 ఉదయం 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

అభ్యర్ధుల అర్హతలు: హాకీ, క్రికెట్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌, ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, టేబుల్ టెన్నీస్‌.. లాంటి పలు విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్ధులు సంబంధిత క్రీడా విభాగంలో అర్హతతోపాటు ఐటీఐ, పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థులు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలి..లేదా జాతీయ, యూనివర్సిటీ స్థాయి పోటీలలో టాప్ ర్యాంకులను సాధించి ఉండాలనే నిబంధన నోటిఫికేషన్‌ ఉంది.

Also Read: https://teluguprabha.net/career-news/mega-dsc-2025-final-list-very-soon-in-andhra-pradesh/

దరఖాస్తుకు చివరి తేది: అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా అక్టోబర్ 9, 2025వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ (పురుషులు) అభ్యర్ధులు రూ. 500 ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మైనారిటీలు/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ. 250 చొప్పున చెల్లించవల్సి ఉండనుంది. ట్రయల్స్ తర్వాత రూ. 400 తిరిగి అభ్యర్థులకు చెల్లిస్తారు.

పోస్టును బట్టి జీతం: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య క్రీడా సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. క్రీడా సామర్థ్య పరీక్షకు 40 మార్కులు ఉంటాయి. అభ్యర్ధి స్పోర్ట్స్‌ హిస్టరీకి 50 మార్కులు కేటాయించారు. అలగే విద్యార్హతలకు 10 మార్కులు ఉంటాయి. అనంతరం డాక్యుమెంట్ వెరిఫీకేషన్, వైద్య పరీక్షలు సైతం నిర్వహిస్తారు. క్రీడా ట్రయల్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే తదుపరి దశకు పంపించనున్నారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. రూ. 18,000 నుంచి రూ. 45,000 వరకు జీతం రానుందని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌ ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad