Homeకెరీర్JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌- 2026 ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌- 2026 ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

Sri Chaitanya JEE Advanced 2026: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్షలో శ్రీచైతన్య విద్యాసంస్థలు మరోసారి తమ అపూర్వ ప్రతిభను చాటుకున్నాయి. ఈ రోజు విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌- 2026 ఫలితాల్లో దక్షిణ భారతదేశంలో నెం.1 శ్రీ చైతన్య విద్యాసంస్థలు నిలిచాయి. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో నాల్గవ ర్యాంకు మోహిత్‌. ఎస్‌ఎస్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యార్థిదే కావడం విశేషం. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో తొమ్మిదవ ర్యాంకు ఎం. నాగ సహస్ర ఆంధ్రప్రదేశ్‌ బెస్ట్‌ ర్యాంకు శ్రీచైతన్య విద్యార్థిదే. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో పదో ర్యాంకు దర్శ్‌ సిక్కా సాధించారు.

- Advertisement -

మొత్తంగా ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో టాప్ 10 లోపు 3 ర్యాంకులు, టాప్ 100లోపు 4, 9, 10, 17, 21, 26, 28, 30, 31, 36, 37, 38, 40, 41, 44, 45, 52, 56, 59, 62, 64, 66, 67, 72, 73, 74, 79, 81, 87, 91, 92, 93, 95, 98, 99 ర్యాంకులతో ఘనత సాధించారు. టాప్ 100లోపు 35 ర్యాంకులు, అలాగే టాప్ 1000లోపు 196 ర్యాంకులు సాధించి ర్యాంకుల రికార్డుల్లో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించారు. 

Also Read: https://teluguprabha.net/national-news/tn-cm-vijay-slams-dmk-aiadmk-conspiracy-trichy-rally/

ఇదే విజయ పరంపరను కొనసాగిస్తూ జేఈఈ మెయిన్స్‌- 2026లో కూడా శ్రీచైతన్య విద్యార్థులు 300/300 పరిపూర్ణ మార్కులతో రెండు ఆలిండియా 1st ర్యాంకులను సాధింంచారు. అదేవిధంంగా టాప్ 100లో 27 ర్యాంకులు, టాప్ 1000లో 166 ర్యాంకులు సాధింంచి అసాధారణ ప్రతిభను కనబరిచారు.

ఈ అద్భుత విజయాల సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్‌& సీఈఓ సుష్మ బొప్పన.. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, పరిపాలనా సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీచైతన్యలో అమలు చేస్తున్న వినూత్నమైన పరిశోధన ఆధారిత శాస్త్రీయ విద్యా కార్యక్రమాలు, అత్యున్నత స్థాయి అకడమిక్ ప్రణాళికలు, విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం, పరిపాలనా బృందం సమిష్టి కృషి ఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. జేఈఈ మెయిన్స్‌- జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో వరుసగా సాధిస్తున్న ఈ అసాధారణ ఫలితాలు.. తమ విద్యా విధానాల ప్రభావాన్ని, నాణ్యతను, నిరంతర శ్రేష్ఠత, సాధనను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. 

Also Read: https://teluguprabha.net/telangana/tgpssc-job-notifications-monthly-burra-venkatesham-telangana-jobs/

IIT మద్రాస్ జోన్స్‌లో టాప్ 500 లోపు 50 శాతానికి పైగా ర్యాంకులు శ్రీ చైతన్యనే కైవసం చేసుకుందని సుష్మ బొప్పన హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల రంగంలో శ్రీచైతన్య మరోసారి తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ, అత్యుత్తమ ఫలితాలతో విజయపథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News