TG- EAPCET: ఈ రోజు విడుదలైన తెలంగాణ EAPCET- 2026 ఫలితాల్లో ఇంజినీరింగ్‌లోనూ, అగ్రి/ఫార్మాలోనూ టాప్ ర్యాంక్స్‌తో నంబర్ వన్ స్థానంలో నిలిచిన శ్రీచైతన్య విద్యాసంస్థలు ఎప్పటిలాగే రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇంజినీరింగ్‌లో స్టేట్ మూడో ర్యాంక్(ఎం. వంశీధర్ రెడ్డి), నాల్గవ ర్యాంక్(రోషన్ మణిదీప్ రెడ్డి), తొమ్మిదో ర్యాంక్(సమీరాజ్ రెడ్డి)ను శ్రీచైతన్య విద్యార్థులు సాధించారు. ఇక అగ్రి/ఫార్మాలో మూడో ర్యాంక్(సాహితి గీతిక), ఐదో ర్యాంక్(అమైర్ అనాస్), ఆరో ర్యాంక్(నాదల్ షేబా జేరూష), ఏడో ర్యాంక్(పి. అనురాగ్), ఎనిమిదో ర్యాంక్(సాయి శరత్), తొమ్మిదో ర్యాంక్(మారుతి సత్య శ్రీకర్), పదో ర్యాంక్ లాంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మొత్తంగా టాప్ 10లోపు 10 ర్యాంకులతో పాటు, టాప్ 100లోపు 93 ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులకే దక్కాయి.
అంతేకాకుండా నిన్నటి జాతీయ స్థాయి JEE MAIN 2026 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో రెండు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించి, నేటి రాష్ట్ర స్థాయి TG EAPCETలో కూడా తన ఆధిపత్యంతో శ్రీచైతన్య నంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి.. రెండు సార్లు కాదు.. ఏకంగా ఇంజినీరింగ్‌లో ఏడు సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, అగ్రి/ఫార్మాలోనూ ఏడు సార్లు స్టేట్ టాప్ ర్యాంకులు సాధించి విజయ పరంపర కొనసాగిస్తూ ర్యాంకుల సునామీ సృష్టించిన విద్యాసంస్థ శ్రీచైతన్యయేనని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read: https://teluguprabha.net/sports-news/cti-chairmans-letter-to-organize-ipl-season-without-spectators/
ఈ అత్యుత్తమ ఫలితాల వెనుక శ్రీచైతన్య సృష్టించిన అనితర సాధ్యమైన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములు, ఇంటర్నల్ టెస్ట్ పేపర్లు, స్టూడెంట్ టీచర్ One-to-One అడాప్షన్ సిస్టమ్‌తో నిపుణులైన అధ్యాపక బృందం శిక్షణ కీలకంగా నిలిచాయాని సుష్మ అన్నారు. గత 40 ఏళ్లుగా ఇంజినీరింగ్‌లోనైనా, మెడికల్‌లోనైనా అత్యధిక టాప్ ర్యాంకులు/మార్కులు సాధించిన ఘనత ఒక్క శ్రీచైతన్యదేనని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. పోటీ పరీక్ష ఏదైనా, పరీక్ష విధానాలు ఎలా మారినా నెం.1గా నిలిచేది తమ విద్యార్థులేనని, రాబోయే JEE ADVANCED, NEETలో కూడా తమ విద్యార్థుల విజయ పరంపర ఇదేవిధంగా కొనసాగిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను డైరెక్టర్ సుష్మ అభినందించారు.

