Sri Chaitanya School Techno Curriculum: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రికార్డు ఫలితాలు సాధించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పదవ తరగతి సీబీఎస్‌ఈ- 2026 ఫలితాల్లోనూ తన మార్కును చాటింది.
శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు 499 టాప్ మార్కును సాధించడం ద్వారా శ్రీ చైతన్య ఆల్ ఇండియా నెం. 1గా మరోసారి రికార్డు సృష్టించింది. తొమ్మిది మంది విద్యార్థులు 498 మార్కులు ఆ పైన, 19 మంది విద్యార్థులు 497 మార్కులు ఆపైన, 41 మంది విద్యార్థులు 496 మార్కులు ఆపైన, 59 మంది విద్యార్థులు 495 మార్కులు ఆపైన, 490 మార్కులు ఆపైన 268 మంది శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు సాధించారు.
Also Read: https://teluguprabha.net/telangana/temperatures-set-to-rise-over-the-next-three-days-in-telangana/
మొత్తంగా శ్రీచైతన్య స్కూల్‌లోని అన్ని బ్రాంచీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. శ్రీ చైతన్య స్కూల్స్ ఉన్న మెజారిటీ రాష్ట్రాల్లో స్టేట్ టాప్ మార్కులతో పాటు అత్యధిక యావరేజ్, పాస్ పర్సెంటేజ్‌తో ఆలిండియాలోనే కాదు ఆయా రాష్ట్రాల్లో కూడా మేమే నెం. 1 ఉన్నామని స్కూల్ డైరక్టర్ సీమ తెలిపారు.
2025- 26 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా CBSE నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యులమ్ టాప్ మార్కుల్లో గాని, సబ్జెక్టుల వారిగా నూటికి నూరు మార్కులతో అత్యధిక సంఖ్యలో ఫలితాలు సాధించి సంచలనాత్మక రికార్డు సృష్టించిందని సీమ వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/career-news/sri-chaitanya-state-scores-top-marks-in-ap-inter-results/
IIT- JEE, NEET, ఒలింపియాడ్ వంటి జాతీయ, అంతర్జాతీయ, పోటీ పరీక్ష ఫలితాల్లో టాప్ ర్యాంకులతో నెం. 1గా నిలుస్తూ అటు స్టేట్ SSCలోనూ, ఇటు CBSEలోనూ ఇంతటి సంచలనాత్మక ఫలితాలతో శ్రీ చైతన్య స్కూల్- టెక్నో కరిక్యులమ్ పాఠశాల విద్యకి అసలైన నిర్వచనంగా నిలిచిందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.

