ఇవాళ NTA విడుదలచేసిన జేఈఈ మెయిన్(JEE Main) మొదటి సెక్షన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య(Sri Chaitanya) విద్యార్థులు సంచనలం సృష్టించారు. సబ్జెక్టుల వారీగా 42 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. 8 మంది విద్యార్థులు మల్టీపుల్ సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్ సాధించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అత్యధికంగా 42 మంది శ్రీచైతన్య విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. అలాగే అత్యధికంగా మల్టీపుల్ సబ్జెక్టుల్లో 8 మంది విద్యార్థులచే 100 పర్సంటైల్ సాధింపజేసి JEE మెయిన్స్ పరీక్షల్లో మరోసారి తనకు తిరుగులేదని శ్రీచైతన్య సంస్థ నిరూపించింది. ఇటు సబ్జెక్ట్‌ల్లోనూ, అటు పర్సెంటైల్‌లోనూ అత్యధికంగా 100 పర్సెంటైల్ సాధించిన రికార్డును శ్రీ చైతన్య సొంతం చేసుకుంది..
ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ మాట్లాడుతూ.. నేటి పర్సంటైల్ మాత్రమే కాకుండా రాబోయే ర్యాంకుల్లో సైతం శ్రీచైతన్య విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటుతారని ధీమా వ్యక్తం చేశారు. తమ విద్యార్థుల నిరంతర కృషితో పాటు, అనితరసాధ్యమైన ప్రోగ్రాములు, ప్రణాళికలు, మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్, ఇన్ఫినిటీ లెర్న్ ఆన్లైన్ యాప్ దేశంలోనే టాప్ ఫ్యాకల్టీ శిక్షణ వల్లనే ఇంతటి ఘనమైన ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు.