Sri Chaitanya AP Tenth Results: ఏపీ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన SSC పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 599 మార్కులతో ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఆ విద్యార్థి శ్రీచైతన్య స్టూడెంట్ కావడం తమకెంతో గర్వకారణమని స్కూల్ డైరెక్టర్ సీమ హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమ స్కూల్ నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య వివరాలు వెల్లడించారు.
598 ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులు 18 మంది, 597 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 64 మంది, 596 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 139, 595 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 258, 590 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 1,245 మంది, 580 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 4,352 మంది అని సీమ తెలిపారు.
గరిష్ఠంగా 600 మార్కులకి గాను శ్రీచైతన్య స్కూల్ సుమారు సగటు మార్కులు 521 సాధించిందని, మొత్తం ఉత్తీర్ణత శాతం 99%గా నమోదైందని సీమ పేర్కొన్నారు. శ్రీచైతన్య స్కూల్‌కి చెందిన సుమారు 100 బ్రాంచ్‌లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని చెప్పారు. అదేవిధంగా సబ్జెక్టుల వారీగా 100/100 మార్కులు సాధించిన వారి సంఖ్య ఫస్ట్ లాంగ్వేజ్- 5997, సెకండ్ లాంగ్వేజ్- 608, ఇంగ్లీష్- 14, మ్యాథ్స్- 4470, సైన్స్- 1247, సోషల్- 2367, వివిధ సబ్జెక్టుల్లో 14,703 మంది 100/100 మార్కులు సాధించారని వివరించారు.

రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి 21 జిల్లాల్లో 75శాతం శ్రీచైతన్య స్కూల్ మాత్రమే టాప్ ర్యాంక్ సాధించిందని సీమ పేర్కొన్నారు. అదేవిధంగా 64శాతం మండలాల్లో, 77 శాతం పట్టణ, నగరాల్లో శ్రీచైతన్య స్కూల్‌దే టాప్ మార్క్ అని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/comedian-sathya-jetlee-movie-release-trailer-release/
ఇటీవల విడుదలైన JEE MAINS ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు 100 లోపు 12 ర్యాంకులు, 1000 లోపు 77 ర్యాంకులు సాధించారని సీమ వెల్లడించారు. అదేవిధంగా బుధవారం విడుదలైన తెలంగాణ టెన్త్ ఫలితాల్లోనూ శ్రీచైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 597 సాధించడంతో పాటు 580 ఆపైన సాధించిన విద్యార్థులు 829 మంది అని, సుమారు సగటు మార్కులు 532, మొత్తం ఉత్తీర్ణత శాతం 99.7 శాతం అని తెలిపారు.
ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు 500కి 499 మార్కులు సాధించారని, మెజారిటీ రాష్ట్రాల్లో టాప్ మార్కులతో పాటు ఓవరాల్‌గా 100 శాతం పాస్ సాధించామని సీమ హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇంతటి భారీ విజయానికి మరే ఇతర విద్యాసంస్థ కూడా సమీపంలో లేదని శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ అన్నారు. ఈ గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బందిని ఆమె అభినందించారు.

