Homeకెరీర్Sri Chaitanya: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో స్టేట్‌ టాప్‌ మార్కులతో శ్రీచైతన్య ప్రభంజనం

Sri Chaitanya: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో స్టేట్‌ టాప్‌ మార్కులతో శ్రీచైతన్య ప్రభంజనం

Sri Chaitanya AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్‌ 2026 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. స్టేట్‌ టాప్‌ మార్కులతో అరుదైన ఘనత సాధించారు. 

- Advertisement -

జూనియర్‌ ఇంటర్‌ ఎగ్జామ్స్‌ ప్యాటర్న్‌, సిలబస్‌ మారినప్పటికీ MPCలో 470 మార్కులకి 469 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచిన బి. గగన శ్రీ.. శ్రీ చైతన్య విద్యార్థినే అని కళాశాల యాజమాన్యం ప్రకటించింది. BiPCలో 455 మార్కులకు గాను 452 మార్కులతో ఇద్దరు శ్రీచైతన్య విద్యార్థులు స్టేట్‌ టాప్‌ మార్కు సాధించారు. సీనియర్‌ ఇంటర్‌లో 1000 మార్కులకి గాను 992 మార్కులతో ఆరుగురి శ్రీచైతన్య స్టేట్‌ టాప్‌ మార్క్‌, 991 మార్కులతో 37 మంది శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం.

జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 470 మార్కులకి 469 మార్కులతో స్టేట్‌ టాప్ మార్క్‌తో పాటు, 466 ఆపైన 129మంది, 464 ఆపైన 1092 మంది, 460 ఆపైన 3620 మంది శ్రీచైతన్య విద్యార్థులే. జూనియర్‌ ఇంటర్‌ BiPCలో 455 మార్కులకు గాను 452 మార్కులతో ఇద్దరికి స్టేట్‌ టాప్‌ మార్కుతో పాటు 450 మార్కులు ఆ పైన 132 మంది, 440 మార్కులు ఆ పైన 1702 మంది, 435 మార్కులు ఆపైన 2356 మంది, 430 ఆపైన 2940 మంది శ్రీచైతన్య విద్యార్థులే..

Also Read: https://teluguprabha.net/career-news/sri-chaitanya-students-got-top-marks-in-inter-results/

ఇప్పటికే విడుదలైన JEE MAIN 2026లో సెషన్ 1 & 2లో 300కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం.

JEE MAIN 2026లో సెషన్ 1, 2 NTA ప్రొవిజనల్‌ కీ ప్రకారం, 300కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదువుకున్న వారే. ప్రతిఏటా ఐఐటీ- జేఈఈ, NEETలలో అత్యధిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారని.. రేపటి IIT ADVANCED, NEETలోనూ నంబర్‌ వన్‌ ర్యాంకులు సాధిస్తారని అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/ghattamaneni-jayakrishna-srinivasa-mangapuram-teaser-release/

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీచైతన్య సృష్టించిన పటిష్ఠమైన ప్రోగ్రామ్‌లు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి అధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతల వల్లే ఇంటర్మీడియట్‌లో సబ్జెక్ట్స్‌పై తమ విద్యార్థులు కాన్సెప్ట్‌ వారీగా పట్టు సాధించడంతో జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాపర్స్‌గా నిలుస్తున్నారని అన్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్‌ వల్లే ఇంటర్‌లో స్టేట్‌ టాప్‌ మార్కులు సాధ్యమయ్యాయని, దీనితో పాటు రాబోయే ఫలితాల్లో కూడా అగ్రస్థానం శ్రీచైతన్యదే అని నమ్మకం తమకుందని అన్నారు. 

అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, శ్రీచైతన్య విద్యాసంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని సుష్మ బొప్పన అభినందించారు.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News