Sri Chaitanya Inter Results: నేడు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించారు.
జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్కులు 469తో ఇద్దరు, 468 మార్కులు ఆపైన 147, 467 మార్కులు ఆపైన 701 మంది, 466 ఆ పైన 1378 మంది, 465 ఆపైన 1999 మంది, 460 ఆ పైన 4497 మంది విద్యార్థులు శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన వారే కావడం విశేషం.
జూనియర్ ఇంటర్ బైపీసీలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది, 437 ఆపైన 319 మంది, 436 ఆపైన 583 మంది, 435 ఆపైన 837 మంది, 400 మార్కులు ఆ పైన మార్కులు 4941 మంది శ్రీచైతన్య విద్యార్థులే.
ఇక సీనియర్ ఇంటర్‌లో 1000 మార్కులకు గాను 997 స్టేట్ టాప్ మార్కులతో పాటు 996 మార్కులు ఆ పైన ముగ్గురు, 995 మార్కులు ఆ పైన 16 మంది, 990 మార్కులు ఆ పైన 759 మంది శ్రీచైతన్య విద్యార్థులు సాధించారు.
కాగా, ఇప్పటికే విడుదలైన JEE MAIN 2026లో సెషన్ 1, 2 NTA ప్రొవిజనల్ కీ ప్రకారం, 300కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదువుకున్న వారే. ప్రతిఏటా ఐఐటీ జేఈఈ, NEETలలో అత్యధిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారని.. రేపటి IIT ADVANCED, NEETలోనూ నంబర్ వన్ ర్యాంకులు సాధిస్తారని అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/marri-gold-and-diamonds-inaugurated-in-kukatpally/
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీచైతన్య సృష్టించిన పటిష్ఠమైన ప్రోగ్రామ్‌లు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి అధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతే వల్లే ఇంటర్మీడియట్‌లో సబ్జెక్ట్స్‌పై మా విద్యార్థులు కాన్సెప్ట్ వారీగా పట్టు సాధించడంతో జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాపర్స్‌గా నిలుస్తున్నారని అన్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లే ఇంటర్‌లో స్టేట్ టాప్ మార్కులు సాధ్యమయ్యాయని, దీనితో పాటు రాబోయే ఫలితాల్లో కూడా అగ్రస్థానం శ్రీచైతన్యదే అని నమ్మకం తమకుందని అన్నారు.
అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, శ్రీచైతన్య విద్యాసంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని సుష్మ బొప్పన అభినందించారు.

