Saturday, November 15, 2025
Homeకెరీర్SSC Constable Jobs: ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు..జీతం ఎంతంటే..?

SSC Constable Jobs: ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు..జీతం ఎంతంటే..?

SSC Constable: నిరుదోగ్య అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ 7,565 ఢిల్లీ పోలీస్‌ సర్వీస్‌ కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న నిరుదోగ్య అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, దరఖాస్తు తేదీలు, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

- Advertisement -

నోటిఫికేషన్ పూర్తి వివరాలు

ఖాళీల సంఖ్య: 7565

పోస్ట్ లు: కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు- 4,408 పోస్టులు, కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు- 2,496 పోస్టులు, కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [ఎక్స్-సర్వీస్‌మెన్ (ఇతరులు)] -285 పోస్టులు, కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [ఎక్స్-సర్వీస్‌మెన్ (కమాండో)] -376 పోస్టులు.

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (సీనియర్ సెకండరీ) పాసై ఉండాలి.

వయోపరిమితి: 2025 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం..ఓబీసీలకు మూడేళ్లు, బీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకు ఐదేళ్ల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం

దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 21

దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబర్‌ 29 నుంచి 31 వరకు

దరఖాస్తు ఫిజు: రూ.100 ఫిజు ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు నో ఫీజు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ డ్ పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT), మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

 

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం

ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుమారులు, కుమార్తెలు, బ్యాండ్స్‌మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్ తదితరులకు అర్హతలో అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. అయితే, పురుష అభ్యర్థులు తప్పనిసరిగా పీఈ&ఎంటీ తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad