Tuesday, November 5, 2024
Homeకెరీర్SSC GD Constable 2025: దరఖాస్తుల సవరణకు అవకాశం

SSC GD Constable 2025: దరఖాస్తుల సవరణకు అవకాశం

SSC GD Constable 2025| దేశ భద్రతలో రక్షణ దళం ముఖ్యమైన విభాగం. ఈ విభాగంలో కానిస్టేబుల్ భర్తీకి సంబంధించి SSC జీడీ కానిస్టేబుల్((SSC GD Constable) నియామకాల నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి 10వ తరగతి అర్హతతో ఇప్పటికే సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14 వరరు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఈ దరఖాస్తుల్లో తప్పుల సమరణకు నవంబర్ 5, 6, 7 తేదీల్లో అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ssc.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

- Advertisement -

ఈ పోస్టులకు సంబంధించి వచ్చే ఏడాది (2025) జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు. బీఎస్‌ఎఫ్‌(BSF), సీఐఎస్‌ఎఫ్‌(CISF), సీఆర్‌పీఎఫ్‌(CRPF), ఐటీబీపీ(ITBP), ఎస్‌ఎస్‌బీ(SSB), ఎస్‌ఎస్‌ఎఫ్‌(SSF)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD), ఎన్‌సీబీ(NCB)లో సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

విభాగాల వారీగా పోస్టుల ఖాళీలు..

BSF: 15654
CISF: 7145
CRPF: 11541
SSB: 819
ITBP: 3017
AR: 1248
SSF: 35
NCB: 22

పరీక్షా ప్రశ్నపత్రం 160 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక గంటలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్‌ లేదా ఏదైనా భాషను పరీక్ష మీడియంగా ఎంచుకోవచ్చు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో 10వ తరగతి సిలబస్‌ స్థాయిలోనే ఉంటాయి. అన్ని విభాగాల్లోనూ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం కేటగిరీల వారీగా ఖాళీలకు 2 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెడికల్‌ టెస్టులకు అవకాశం కల్పిస్తారు. అందులోనూ విజయవంతమైతే తుది ఎంపిక ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News