SSC Notification: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ అందించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌లో భాగంగా 12,256 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 22, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొంది ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు ఆగస్ట్ 1, 2026 నాటికి ఉత్తీర్ణత సాధించినట్లు ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
ప్రత్యేక పోస్టులకు అదనపు అర్హతలు: జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్టులకు మాత్రం డిగ్రీతో పాటు ఇంటర్‌లోని మ్యాథ్స్‌లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 పోస్టులకు అయితే డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్, గణితం, లేదా ఎకనామిక్స్ సబ్జెక్టులను ప్రధానాంశాలుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: ఆగస్ట్ 1, 2026 నాటికి పోస్టుల కేటగిరీలను బట్టి వయోపరిమితి వేర్వేరుగా ఉంది. కనిష్ట వయస్సు 18 ఏళ్లు కాగా.. గరిష్ట వయస్సు పోస్టును బట్టి 27, 30, 32 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు మరియు ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: రూ. 100/-
- మహిళలు, ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులు (PwBD) మరియు మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుండి పూర్తి మినహాయింపు కలదు.
ఎంపిక విధానం: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. దీనిలో రెండు దశలు ఉంటాయి. మొదట టైర్-1 పరీక్షను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి డిసెంబర్‌లో టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి సందేహాలున్నా అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక టోల్ ఫ్రీ నంబర్ 1800 309 3063 ను సంప్రదించవచ్చు.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు:
- మొత్తం ఖాళీలు: 12,256 పోస్టులు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- చివరి తేదీ: జూన్ 22, 2026
- టైర్-1 పరీక్ష (CBT): ఆగస్టు – సెప్టెంబర్, 2026
- టైర్-2 పరీక్ష (CBT): డిసెంబర్, 2026 (అంచనా)
- వేతనం: పోస్టులను బట్టి నెలకు రూ. 25,500 నుండి రూ. 1,51,100 వరకు
- హెల్ప్‌లైన్ నంబర్: 1800 309 3063

