Homeకెరీర్University of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఖాళీలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలకన్

University of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఖాళీలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలకన్

Teaching Posts in University of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కాంట్రాక్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుండగా.. ఇంగ్లిష్, సైన్స్, గణితం, కంప్యూటర్ సైన్స్ వంటి పలు సబ్జెక్టుల్లో టీచింగ్‌ స్టాఫ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 కాంట్రాక్టు పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు 6 నెలల కాలపరిమితి (జూన్ 22 నుంచి డిసెంబర్ 26 వరకు) కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Also read: Telangana: సచివాలయంలో ఆందోళన.. మూడు నెలలుగా జీతాల్లేవని హౌస్ కీపింగ్ సిబ్బంది నిరసన!

పోస్టులు – ఖాళీలు 

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ- కంప్యూటర్ సైన్స్) – 01, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ- వివిధ సబ్జెక్టులు) – 13, ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ) – 10 పోస్టులు, కౌన్సిలర్ – 1 పోస్టు

ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే..

క్యాంపస్ స్కూల్‌లో ఈ నెల 9 నుంచి 11 వరకు సబ్జెక్టుల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ సబ్జెక్టును బట్టి నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. జూన్ 9న టీజీటీ (సోషల్ సైన్స్, ఇంగ్లిష్), పీఆర్‌టీ (ప్రీ-ప్రైమరీ, ఈవీఎస్) ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ నెల 10న టీజీటీ/పీఆర్‌టీ (సైన్స్, తెలుగు, హిందీ, గణితం), ఈ నెల 11 పీజీటీ (కంప్యూటర్ సైన్స్), కౌన్సిలర్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈటీ) పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉదయం 9:00 నుంచి 10:00 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు అరగంట ముందే గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్‌లో రిపోర్ట్ చేయాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. పూర్తిగా ఫిల్‌ చేసిన దరఖాస్తు ఫారం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రం (ఆధార్/ఓటర్ ఐడీ). అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, స్వయంగా ధ్రువీకరించిన జిరాక్స్ కాపీల సెట్ తీసుకురావాలి. అభ్యర్థులు ఇంటర్వ్యూకు వెళ్లే ముందు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.uohyd.ac.inను సందర్శించాలి.

ఆకర్షనీయమైన జీత భత్యాలు..

ఎంపికైన ఉపాధ్యాయులకు వారి హోదాను బట్టి ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది. పీజీటీ కంప్యూటర్ సైన్స్ నెలకు రూ.48 వేలు, టీజీటీ, కౌన్సిలర్ నెలకు రూ. 45 వేలు, ప్రైమరీ టీచర్ నెలకు రూ. 35 వేల వరకు జీతం లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News