Homeకెరీర్Vidya nidhi : విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓవర్సీస్‌ విద్యా నిధి దరఖాస్తులు ప్రారంభం

Vidya nidhi : విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓవర్సీస్‌ విద్యా నిధి దరఖాస్తులు ప్రారంభం

హైదరాబాద్‌ (తెలుగుప్రభ): విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద 2026 ఆగస్టు/సెప్టెంబర్‌ ఫాల్‌ సెషన్‌కు సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

- Advertisement -

ఈ విడతలో 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా.. 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. వయస్సు 35 ఏళ్లలోపు, గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. జీఆర్ఈలో 260 లేదా జీమ్యాట్‌లో 500 స్కోర్‌తో పాటు టోఫెల్‌ 60, ఐఈఎల్‌టీఎస్‌ 6.0 లేదా పీటీఈ 50 స్కోర్‌లో ఏదైనా ఒక అర్హత ఉండాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News