హైదరాబాద్ (తెలుగుప్రభ): రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లతోపాటు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ 5న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
సీట్ల ఎంపిక కోసం సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబర్ 9న ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు (ఎడిట్ ఆప్షన్) అవకాశం కల్పించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 12న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఎడ్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు కేటాయించిన కళాశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు రిపోర్టు చేయాలని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు.

