Edcet-2026 results: తెలంగాణలో బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్-2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 12న రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. పరీక్ష ముగిసిన అనంతరం అధికారులు ప్రాథమిక కీని విడుదల చేశారు. అనంతరం అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత తాజాగా తుది ఫలితాలను వెల్లడించారు.
త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్: ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,600 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 29,342 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలతో పాటు ర్యాంకు కార్డులను ఎడ్‌సెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. త్వరలోనే బీఈడీ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించనుందని పేర్కొన్నారు.
Also read-AP EdCET: ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల.. 99.3 శాతం ఉత్తీర్ణత

