HomeTop StoriesInter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారు..

Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారు..

Telangana Inter Results: తెలంగాణ 2026 ఇంటర్ ఫలితాలు విడుదల తేదీపై తెలంగాణ విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నట్టుగా ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. అదేరోజు ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని తెలిపింది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫలితాలను వెల్లడించిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, ఇంటర్‌ ఫలితాలను కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ స్పందించిన గంటల వ్యవధిలోనే ఫలితాల తేదీని ప్రకటించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-naidu-is-angry-with-ministers-over-information-leakage/

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tgbie.cgg.gov.in/ను సందర్శించాలి. అక్కడ ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండియర్ రిజల్ట్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకునే సదుపాయం ఉంది.

Also Read: https://teluguprabha.net/telangana/good-news-for-telangana-rtc-employees-da-hiked-by-2-1-percent/

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు-2026ను ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించగా.. ఇంటర్ వార్షిక పరీక్షలకు సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న విధానంలోనే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకే రోజు విడుదల చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News