Telangana Inter Supplementary: మే 13 నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్థులు సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. మరోవైపు మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
Also Read: https://teluguprabha.net/top-stories/telangana-intermediate-results-released-today/
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను అధికారులు ఈ రోజు ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 9.97 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 66.2 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ద్వితీయ సంవత్సరంలో 70.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు ఫలితాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు.
ఇదిలా ఉండగా.. 2026 మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలను ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మే 22 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20 వరకు అవకాశం ఉంది. మరోవైపు మార్కుల రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కూడా ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు వివరించింది.

