Homeకెరీర్Telangana: పాలిసెట్ ఫలితాలు విడుదల.. 82.94 శాతం ఉత్తీర్ణత

Telangana: పాలిసెట్ ఫలితాలు విడుదల.. 82.94 శాతం ఉత్తీర్ణత

TG Polycet results: తెలంగాణలో పాలిసెట్‌-2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 11:30 గంటలకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పాలిసెట్ ర్యాంకులే కీలకం కానున్నాయి.

- Advertisement -

నామాల లోకేశ్‌ ఫస్ట్‌ ర్యాంక్‌: పాలిసెట్‌లో మొత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. వరంగల్‌కు చెందిన నామాల లోకేశ్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా.. సూర్యాపేటకు చెందిన బోనోతు హేమనాథ్‌ రెండో ర్యాంక్‌ సాధించాడు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సైతం అధికారులు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Also read-Polycet: విడుదలైన ఏపీ పాలిసెట్‌ ఫలితాలు.. 91.37 శాతం ఉత్తీర్ణత!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News