Homeకెరీర్Army jobs: ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం.. లక్షన్నరకు పైగా జీతం!

Army jobs: ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం.. లక్షన్నరకు పైగా జీతం!

TES-56 Notification: ఇంటర్మీడియట్​ అయిపోయిన విద్యార్థులకు ఇండియన్‌ ఆర్మీ గుడ్‌ న్యూస్‌ అందించింది. 56వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TES) కోసం భారత సైన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్కీమ్​ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మిలటరీ ట్రైనింగ్‌తో పాటు.. ఉచితంగా ఇంజినీరింగ్ విద్య అందించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కోర్సుకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితితో పాటు ఎంపిక విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం

- Advertisement -

టీఈఎస్‌- 56 నోటిఫికేషన్ విడుదల: ఇండియన్ ఆర్మీ 2027 జనవరిలో ప్రారంభం కానున్న 56వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కోర్సుకు ఇంటర్‌ పూర్తి చేసిన అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్​కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు సాంకేతిక శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత ఉద్యోగాన్ని ఇండియన్‌ ఆర్మీ కల్పిస్తుంది. అయితే ప్రస్తుతం మొత్తం 90 ఖాళీలకు గాను టీఈఎస్‌- 56 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. భారత సైన్యంలో పని చేయాలనే ఉత్సహం ఉన్న అభ్యర్థులు.. తగిన అర్హతలు కలిగి ఉంటే జూన్‌ 12 వరకు ఆన్​లైన్​ విధానంలో అప్లై చేసుకోవాలని నేటిఫికేషన్‌లో తెలిపారు.

విద్యార్హతలు :  అభ్యర్థులు గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 60 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణ సాధించాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్​ సబ్జెక్టులుగా ఉన్న కోర్సులుగా తీసుకున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. అంతేకాకుండా JEE మెయిన్స్ – 2026 స్కోర్ తప్పనిసరి ఉండాలి. మరో ముఖ్యగమనికి ఏంటంటే.. విద్యార్హతలతో పాటు అభ్యర్థులు ఆర్మీ ఆఫీసర్లకు ఉండాల్సిన నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. వయస్సు రిత్యా ఇండియన్ ఆర్మీ టీఈఎస్‌ కోర్సుకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు జనవరి 1, 2027 నాటికి 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

Also read-CCMB:హైదరాబాద్ సీసీఎంబీలో ఉద్యోగాల జాతర.. పది పాసైతే చాలు!

లక్షన్నరకు పైగా జీతం! : ఈ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు మిలటరీ సర్వీస్ పే కింద స్టైపెండ్ రూపంలో నెలకు రూ.15,500 అందిస్తారు. అంతేకాకుండా మూడేళ్ల ట్రైనింగ్ అనంతరం బేసిక్ పే నెలకు రూ.56,100- రూ.1,77,500 అందిస్తారు. వీటితో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఎతో మరికొన్ని బెనిఫిట్స్ సైతం ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News