TG Board releases Schedule for Intermediate Exams: ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమై మార్చి 18 వరకు జరగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో మార్చిలో మొదలయ్యే పరీక్షలు ప్రారంభమవ్వగా.. ఈ ఏడాది జేఈఈ మెయిన్, ఎప్‌సెట్ (ఎంసెట్), నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా, ఫిబ్రవరి 25 నుంచే పరీక్షలను మొదలుపెట్టాలని బోర్డు నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం ఎక్కువ సమయం లభిస్తుందని తెలిపింది. అలాగే ఈ ఏడాది ఎగ్జామ్ సిలబస్, ప్రాక్టికల్స్‌లో జరగబోయే మార్పుల గురించి కూడా వివరించింది.
Also Read: https://teluguprabha.net/national-news/amitabh-bachchan-getting-warning-calls-from-sfj/
ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లోనూ ల్యాబ్ ఎగ్జామ్..
సాధారణంగా ఇంటర్మీడియట్ సెకండియర్‌లో ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయి. కానీ ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు. అలాగే, 12 ఏళ్ళ తర్వాత ఇంటర్ సిలబస్ మార్పులు జరుగబోతున్నట్లు వెల్లయించారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకి సంబంధించిన సిలబస్ మారబోతున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 21న ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత 25 నుంచి రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు.
ఏ పరీక్ష ఏ రోజు?
ఫిబ్రవరి 25: పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
ఫిబ్రవరి 27: పార్ట్ 2 – ఇంగ్లీష్ పేపర్ -1
మార్చి 2: మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చి 5: మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
మార్చి 9: ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
మార్చి 03: కెమిస్ట్రీ, కామర్స్
మార్చి 17: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
ఫిబ్రవరి 26: పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
ఫిబ్రవరి 28: పార్ట్ 1 – ఇంగ్లీష్ పేపర్ -2
మార్చి 03: మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
మార్చి 6: మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
మార్చి 10: ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
మార్చి 13: కెమిస్ట్రీ, కామర్స్ -2
మార్చి 16: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
మార్చి 18: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1


