ఈ ఏడాది ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్(TG EAPCET) నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6-8 వరకు దరఖాస్తులో సవరణలు చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 14 వరకు, రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 18 వరకు, రూ. 5 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు.. మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహిస్తారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఏపీలోని కర్నూలు, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.