EAPCET Hall Tickets: తెలంగాణ ఎంసెట్ (TG EAPCET) 2026 రాసే అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లుగా పేర్కొంది. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in సందర్శించాలి. హోమ్ పేజీలో కనిపించే ‘Download Hall Ticket’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆతరువాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్‌తోపాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. అనంతరం వివరాలు సరిచూసుకుని సబ్‌మిట్ బటన్ క్లిక్ చేస్తే.. స్క్రీన్‌పై హాల్ టికెట్ కనిపిస్తుంది. హాల్ టికెట్‌పై ఉన్న పరీక్ష కేంద్రం చిరునామా, సమయం మరియు అభ్యర్థులకు సూచించిన నిబంధనలను జాగ్రత్తగా చదువుకోవాలని అధికారులు సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే హెల్ప్ డెస్క్ నంబర్లను సంప్రదించవచ్చు.
Also read-Sri Chaitanya: JEE Main 2026 ఫలితాల్లో శ్రీచైతన్య డబుల్ రికార్డ్
ముఖ్యమైన తేదీలు ఇవే: అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్ల నేటి నుంచి అందుబాటులో ఉండనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 4, 5లలో జరుగనున్నాయి. ఇంజినీరింగ్ విభాగంకు చెందిన హాల్ టికెట్లను మాత్రం ఏప్రిల్ 27 నుంచి అందుబాటులో ఉండనున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు మే 9 నుండి 11 మధ్య జరుగనున్నట్లుగా ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

