Homeకెరీర్TG EAPCET: నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు.. పరీక్ష ముగిసిన 6 రోజుల్లోనే ఫలితాలు!

TG EAPCET: నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు.. పరీక్ష ముగిసిన 6 రోజుల్లోనే ఫలితాలు!

EAPCET Results: తెలంగాణ ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ (JNTU-H) వేదికగా ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

- Advertisement -

పరీక్ష ముగిసిన 6 రోజుల్లోనే ఫలితాలు: ఎప్‌సెట్ చరిత్రలోనే పరీక్షలు పూర్తయిన కేవలం ఆరో రోజే ఫలితాలను విడుదల చేస్తుండటం విశేషం. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్‌ స్క్రీన్‌పై అప్పటికప్పుడే మార్కులు ప్రత్యక్షమయ్యేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఫలితాలు ఇంత త్వరగా వెలువడనున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.eapcet.tgche.ac.in ద్వారా తమ ఫలితాలను, ర్యాంకులను తెలుసుకోవచ్చు.

ఫలితాలు విడుదల చేయనున్న కె.కేశవరావు: ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, జేఎన్‌టీయూ-హెచ్‌ వీసీ టి.కిషన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని ఎప్‌సెట్ కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News