తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్(TG ICET 2025) నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు మార్చి 10వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 అపరాధ రుసుంతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 26 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 16 నుంచి 20 వరకు సరిచేసుకోవచ్చు.
అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ పరీక్ష కేంద్రాల్లో జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.550, బీసీలు,జనరల్ విద్యార్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tgche.ac.in/ని సందర్శించండి.