TGPSC Group 3 Certificate Verification Details : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా గ్రూప్-3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పేసింది. 1388 పోస్టులకు మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్ధులకు నవంబర్ 10 నుంచి 26 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఈ ప్రక్రియ జరుగుతుంది. హాల్ టికెట్ వారీగా షెడ్యూల్ TGPSC వెబ్‌సైట్‌లో ఉంది. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలి. TGPSC కార్యదర్శి, “అన్ని డాక్యుమెంట్లు స్వీయ ధ్రువీకరణతో సమర్పించాలి. PWBD అభ్యర్థులకు వైకల్య అంచనా కోసం అప్పీలేట్ మెడికల్ బోర్డు నివేదిక మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము” అని తెలిపారు.
ALSO READ: Ind vs SA: సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. వైజాగ్ లో కీలక మ్యాచ్..
వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
మెరిట్ జాబితా మార్చి 14, 2025న విడుదలైంది. ఈ పరిక్షలు గత ఏడాది నవంబర్ లో జరిగాయి. 2.67 లక్షల మంది హాజరయ్యారు. వెరిఫికేషన్‌లో డాక్యుమెంట్లు చెక్ చేసి, ఎలిజిబిలిటీ ధృవీకరిస్తారు. పాస్ అయితే ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్‌లు వస్తాయి. ఫెయిల్ అయితే క్యాన్సలేషన్. అభ్యర్థులు సమయానికి హాజరు కాకపోతే అవకాశం పోతుంది. TGPSC వెబ్‌సైట్‌లో షెడ్యూల్, ఫార్మాట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు
1. దరఖాస్తు ఫారం (2 కాపీలు)
2. హాల్ టికెట్
3. ఆధార్/వోటర్ ID/డ్రైవర్ లైసెన్స్/పాన్/పాస్‌పోర్ట్ (ఏదైనా గవ. ID)
4. విద్యార్హతల సర్టిఫికెట్లు
5. SSC/CBSE/ICSE సర్టిఫికెట్
6. 1 నుంచి 7వ తరగతి స్టడీ సర్టిఫికెట్
7. నివాస ధ్రువీకరణ (తెలంగాణలో చదవకపోతే)
8. నిరుద్యోగ ప్రకటన (ఫీజు మినహాయింపు కోసం)
9. నిర్భగా పత్రం (ప్రస్తుత ఉద్యోగం ఉంటే)
10. సర్వీస్ సర్టిఫికెట్ (వయసు సడలింపు కోసం)
11. క్రీడా రిజర్వేషన్ సర్టిఫికెట్
12. మాజీ సైనికుల సర్టిఫికెట్ (వయసు/రిజర్వేషన్ కోసం)
13. BC/SC/ST కమ్యూనిటీ సర్టిఫికెట్ (తల్లిదండ్రుల పేరుతో)
14. BC నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికెట్
15. EWS సర్టిఫికెట్
16. PH అభ్యర్థులకు SADAREM సర్టిఫికెట్
17. ధ్రువీకరణ ఫారమ్ (2 సెట్లు)
18. ఇతర అవసరమైనవి
ఈ వెరిఫికేషన్ పూర్తి తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. TGPSC గ్రూప్-3 పోస్టులు – జూనియర్ అకౌంటెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. 2024 పరీక్షల్లో 2.67 లక్షల మంది పాల్గొన్నారు. అభ్యర్థులు సమయానికి హాజరు కావాలి. మరిన్ని వివరాలకు tgpsc.gov.in చూడండి. మీరు గ్రూప్-3 అభ్యర్థి అయితే రెడీగా ఉండండి!


