TGSET-2026: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీసెట్-2026) అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. పీజీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 3 నుంచి ఆగస్టు 30 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 12 వరకు అవకాశం: ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు రూ.3,000 లేట్ ఫీజుతో సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు పక్రియ ముగిసిన అనంతరం అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, సిలబస్ తదితర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ telanganaset.org ను సందర్శించాలని అధికారులు సూచించారు.
అర్హత వివరాలు&పరీక్ష విధానం: పీజీ ఆఖరు సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక పరీక్ష విధానానికి వస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లుగా పరీక్షను నిర్వహిస్తారు. మొదటి పేపర్‌లో 50 ప్రశ్నలు 100 మార్కులకు, రెండో పేపర్ 100 ప్రశ్నలు 200 మార్కులకు 3 గంటలో వ్యవధిలో ఉండనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. పరీక్షకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు, సిలబస్ తదితర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ telanganaset.org ను సందర్శించాలని అధికారులు సూచించారు.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం- ఆగస్టు 3
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- ఆగస్టు 30
- ఆలస్య రుసుం రూ.1500, రిజిస్ట్రేషన్ ఫీజుతో- ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 05 వరకు
- ఆలస్య రుసుం రూ.2000, రిజిస్ట్రేషన్ ఫీజుతో- సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 10 వరకు
- ఆలస్య రుసుం రూ.3000, రిజిస్ట్రేషన్ ఫీజుతో- సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 12 వరకు
- దరఖాస్తులో మార్పులకు అవకాశం: సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 15 వరకు
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: సెప్టెంబర్ 22 నుంచి.
- పరీక్ష తేదీలు: సెప్టెంబరు చివరి వారంలో ఉండే అవకాశం

