Sunday, November 16, 2025
Homeకెరీర్TGSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు!

TGSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు!

TGSRTC drivers and workers Recruitment: టీజీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల నియామకానికి అక్టోబర్‌ 8వ తేది నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఛైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

కొత్తగా నిర్దేశించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్: ఆన్‌లైన్‌ దరఖాస్తుతోపాటు ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్తగా నిర్దేశించిన ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కొత్త సర్టిఫికెట్‌ను పొందలేకపోతే.. వారి వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయవచ్చని తెలిపారు. డ్రైవర్‌ పోస్టులకు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు.. శ్రామిక్‌ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు మాత్రం ఐదేళ్లు.. అలాగే ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు.

Also Read: https://teluguprabha.net/career-news/3500-apprentice-posts-in-canara-bank-with-any-degree-qualification/

పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు అప్పగింత: అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలో మాత్రం కొత్త ప్రొఫార్మాలో కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను సమర్పించాలని వీవీ శ్రీనివాసరావు అన్నారు. అలా చేయకపోతే ఎస్సీ కేటగిరీ కింద పరిగణించబోమని తెలిపారు. టీజీఎస్‌ ఆర్టీసీలోని వెయ్యి డ్రైవర్‌ పోస్టులకు, 743 శ్రామిక్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్పీఆర్బీ దరఖాస్తులను ఆహ్వానిస్తుందని అన్నారు. ఇందులో డ్రైవర్‌పోస్టుకు పేస్కేల్‌ రూ.20,960 నుంచి రూ.60,080 కాగా ఉంది. శ్రామిక్‌ పోస్టులకు రూ.16,550 నుంచి రూ. 45,030గా ఉన్నట్టుగా నోటిఫికేషన్‌లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వివరాల కోసం టీఎస్‌ఎల్పీఆర్బీ చూడాలని శ్రీనివాసరావు సూచించారు. టీజీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్‌ 17న విడుదలైంది. గతంలో తన సంస్థలోని డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల నియామకంను ఆర్టీసీనే భర్తీ చేసేది. ఈ సారి మాత్రం డ్రైవర్, శ్రామిక్‌ పోస్టుల భర్తీని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు అప్పగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad