Last date for Jobs applications of TGCAB: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB) లోని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు మిగిలి ఉంది. గత కొద్ది రోజుల కిందట విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఆఫీస్ అసిస్టెంట్ (Office Assistants) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే TSCAB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి డిగ్రీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మరో రెండ్రోజులే గడువు ఉంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే TSCAB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించడమైనది.
పరీక్షా విధానం:
TSCAB ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది:
ప్రిలిమినరీ ఆన్‌లైన్ టెస్ట్ (Preliminary Online Test):
ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.
ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తారు. అలాగే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
మెయిన్స్ ఆన్‌లైన్ టెస్ట్ (Main Online Test):
ఇది ప్రధాన ఎంపిక పరీక్ష. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది మరియు 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 140 నిమిషాలు.
మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
మరిన్ని పూర్తి వివరాల కోసం, దరఖాస్తు చేసుకునే విధానం, పరీక్షా తేదీలు, సిలబస్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ అయిన https://tgcab.bank.in/ ను సందర్శించవచ్చు.


