Saturday, November 15, 2025
HomeTop StoriesUCEED 2026 Notification: యూసీడ్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌.. ఐఐటీల్లో ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

UCEED 2026 Notification: యూసీడ్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌.. ఐఐటీల్లో ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

UCEED 2026 Notification for Fashion Design Courses in IITs: ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీబీ) 2026-27 విద్యా సంవత్సరానికి డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో మంచి ర్యాంకు సాధిస్తే ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో డిజైన్‌, ఫ్యాషన్‌ కోర్సులు చదవొచ్చు. యూసీడ్‌ ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా హైదరాబాద్‌, బాంబే, ఢిల్లీ, గువాహటి, రూర్కీ, ఇండోర్‌ ఐఐటీల్లో, ఐఐఐటీడీఎం (జబల్పూర్‌)తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచులర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. యూసీడ్‌ స్కోర్‌ వ్యాలిడిటీ ఏడాది పాటు ఉంటుంది. విద్యార్ధులు వరుసగా రెండుసార్లు మాత్రమే ఈ టెస్ట్‌ రాయడానికి వీలుంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో మొత్తం 245 డిజైన్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎవరైనా అక్టోబర్‌ 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.

- Advertisement -

ఏ ఐఐటీలో ఎన్ని సీట్లు?

ఐఐటీ బాంబేలో 37 సీట్లు, ఐఐటీ దిల్లీలో 20 సీట్లు, ఐఐటీ గువాహటిలో 56 సీట్లు, ఐఐటీ హైదరాబాద్‌లో 30 సీట్లు, ఐఐటీ ఇండోర్‌లో 16 సీట్లు, ఐఐటీ రూర్కీలో 20 సీట్లు, ఐఐటీ జబల్‌పూర్‌లో 66 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ గ్రూప్స్‌లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. బైపీసీ సహా ఆర్ట్స్‌, కామర్స్‌ గ్రూప్‌లు చదివినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించే రెండేళ్ల జాయింట్‌ సర్వీసెస్‌ వింగ్‌ కోర్సు పూర్తిచేసినవారు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) నిర్వహించే సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణత పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తుకు అర్హులే. అయితే, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అక్టోబర్‌ 1, 2001 లేదా ఆ తర్వాత జన్మించిన వారై ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇంపార్టెంట్‌ డేట్స్‌..

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 31, 2025లోపు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. నవంబర్‌ 7 వరకు ఆలస్య రుసుంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. 2026 జనవర్‌ 2 నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2026 జనవరి 18వ తేదీన పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక, 2026 మార్చి 6న ఫలితాల విడుదలవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad