UGC NET Notification: దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) మరియు పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత కల్పించే యూజీసీ నెట్ – జూన్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో మొత్తం 85 సబ్జెక్టులలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ (PG) కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జేఆర్‌ఎఫ్ (JRF) అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎటువంటి వయోపరిమితి లేదు.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్థులు: రూ. 1,150
- ఈడబ్యూఎస్, ఓబీసీఅభ్యర్థులు: రూ. 600
- ఎస్టీ, ఎస్సీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు: రూ. 325
దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in/ సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT Mode) ఈ పరీక్షలు జరగనున్నాయి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం- ఏప్రిల్ 29, 2026
- దరఖాస్తుకు చివరి తేదీ- మే 20, 2026 (రాత్రి 11:50 వరకు)
- దరఖాస్తుల సవరణ- మే 22 నుండి 24 వరకు
- అడ్మిట్ కార్డుల జారీ- జూన్ 15, 2026

