Homeకెరీర్UGC NET: నేటితో యూజీసీ నెట్ దరఖాస్తు గడువు ముగింపు

UGC NET: నేటితో యూజీసీ నెట్ దరఖాస్తు గడువు ముగింపు

UGC NET: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం నిర్వహించే యూజీసీ నెట్ (UGC NET) జూన్ 2026 సెషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. నిజానికి ఆన్‌లైన్ దరఖాస్తు గడువు శనివారం (మే 23) రాత్రి 11:59 గంటలతోనే ముగిసింది. అయితే దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల నుంచి వచ్చిన విపరీతమైన వినతుల దృష్ట్యా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. అభ్యర్థులు నేడు (ఆదివారం) ఆలస్య రుసుము (Late Fee) చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ విండోను అందుబాటులో ఉంచింది.

- Advertisement -

కీలక తేదీల వివరాలు:

  • ఆలస్య రుసుముతో దరఖాస్తుకు ఆఖరి తేదీ: మే 24- 2026 (నేడు)
  • ఫీజు చెల్లింపునకు ఆఖరి సమయం: మే 24- 2026 (నేడు)
  • దరఖాస్తుల సవరణ (Corrections) గడువు: ఈ నెల 26 నుండి 28 వరకు అవకాశం కల్పిస్తారు.

అభ్యర్థులకు అధికారుల సూచన: చివరి నిమిషంలో దరఖాస్తుదారుల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉందని ఎన్‌టీఏ అధికారులు హెచ్చరించారు. కాబట్టి అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జాతీయ అర్హత పరీక్ష (UGC NET) తేదీల పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in/ ను సందర్శించవచ్చు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News