10th Class Results: సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు చేరువ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పదో తరగతి (SSC) ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. నేరుగా తమ మొబైల్‌లోనే ఫలితాలను పొందే సౌకర్యాన్ని కల్పించింది.
మధ్యాహ్నం 2:30లకు ఫలితాలు: తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సమన్వయంతో మీ సేవ (MeeSeva) ఈ సేవలను అందిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ఫలితాలు విడుదలవుతాయి. ఆ వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా వాట్సాప్‌లోనే మార్కుల మెమోను పొందవచ్చు.
Also read- Telangana: నేడు పదో తరగతి ఫలితాలు.. తల్లిదండ్రులకు సజ్జనార్ విజ్ఞప్తి!
వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే విధానం: విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా ఫలితాలను పొందవచ్చు. మొదటగా మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana” పేరుతో సేవ్ చేసుకోండి. అనంతరం వాట్సాప్ ఓపెన్ చేసి సదరు నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి. చాట్‌లో ‘SSC Result’ అని టైప్ చేయండి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే ‘Open Service’ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో వాట్సాప్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

