తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్ గురించి
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తరుపున తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మరియు, గౌరవ సినిమాటోగ్రాఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు చేస్తున్న కృషికి ధన్యవాధాలు తెలియజేసారు . గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబందించిన సంస్థల ప్రతినిదులకు వారి సమయం ఇచ్చి ఆ మీటింగులో పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి పేరు తెచ్చు కుంటున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ కొత్త గవర్నమెంటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణాలో అన్నిరకాల అభివృద్ధికి కృష్హి జేస్తారని తెలియజేసారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన వారికి “గద్దర్ అవార్డులు” ప్రదానం చేస్తామని దానికి సంబందించిన విధివిధానాలు తయారు చేయాల నికోరారు.
ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి “గద్దర్” అవార్డ్స్ గైడ్ లైన్స్ ను తెలంగాణ FDC వారికి తెలియజేయడం జరిగింది. ఆవిధంగా త్వరలో “గద్దర్ అవార్డు” కొరకు మార్గదర్శకాలు తెలంగాణ FDC వారి సంప్రదింపులతో తయారు జేసి గౌరవ ముఖ్యమంత్రి గార్కి మరియు గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి గార్కి త్వరలో ఇవ్వడం జరుగుతుంది.
గద్దర్ గారిని చూసి మేము గర్విస్తున్నాము. ఆయన నటునిగా, కళాకారులుగా, జానపద పాటలందు మరియు పేదలకు చేసిన సేవలకు సేవా రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి లెజెండ్ గా ఆయన పట్ల మాకు చాలా గౌరవం ఉంది అని తెలియజేస్తున్నాము.
(టి. ప్రసన్న కుమార్)
గౌరవ కార్యదర్శి