Thursday, May 8, 2025
Homeచిత్ర ప్రభసమంత కొత్త ప్రారంభం.. దర్శకుడు రాజ్ తో ఫోటోలు వైరల్..!

సమంత కొత్త ప్రారంభం.. దర్శకుడు రాజ్ తో ఫోటోలు వైరల్..!

టాలీవుడ్‌లో ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన సమంత.. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ పీక్‌లో ఉండగానే నటుడు నాగ చైతన్యతో ప్రేమలోపడి పెళ్లి చేసుకుంది. అయితే వారి వివాహ జీవితం ఎక్కువ కాలం నిలబడకపోవడంతో విడాకులు తీసుకుని టాలీవుడ్‌కు కొంతకాలం దూరంగా ఉండిపోయింది. అప్పటి నుంచి బాలీవుడ్, వెబ్‌సిరీస్‌లవైపు అడుగులు వేసిన సమంత, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో భారీ హిట్ అందుకుంది. ఈ సిరీస్ ద్వారా నటనకు ప్రశంసలు అందుకున్న ఆమె, దర్శక ద్వయం రాజ్ & డీకేలోని ఒకరైన రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నారని అప్పట్లో గాసిప్స్ చక్కర్లు కొట్టాయి.

- Advertisement -

ఇటీవల చైతన్య రెండో వివాహం చేసుకోగా.. సమంత కూడా పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొన్ని ఫోటోలు మళ్లీ ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ చర్చకు దారితీశాయి. చాలా కష్టమైన ప్రయాణం. కానీ ఇక్కడికి చేరుకున్నాం. ఇది ఓ కొత్త ప్రారంభం (It’s a new beginning) అంటూ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటోలతో పాటు సమంత రాసిన మెసేజ్ కూడా ఆలోచనలు రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే, సమంత నిర్మాణంలో రూపొందిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన ‘సినిమా బండి’కి నిర్మాతగా వ్యవహరించిన రాజ్ నిడిమోరు, ఇప్పుడు అదే దర్శకుడిని సమంత ప్రోత్సహించడం ఆసక్తికర అంశంగా మారింది. ఇంతకీ సమంత చెప్పిన ‘న్యూ బిగినింగ్’ వెనక ఉన్న అసలు కథ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయంపై అభిమానుల నుంచి విస్తృత స్పందన వస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News