12A Railway Colony: అల్లరి నరేష్ అనగానే మనకు గుర్తుకొచ్చేది నవ్వులు పూయించే కామెడీ సినిమాలే. కానీ, కొంతకాలంగా నరేష్ తన కంఫర్ట్ జోన్‌ను వదిలిపెట్టి, కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని సినిమాలు బాగానే అనిపించుకున్నా, మరికొన్ని మాత్రం నిరాశపరిచాయి. ‘నాంది’ సినిమా మంచి స్పందన అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ‘ఇట్లు మీ మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’, ‘ఆ ఒక్కటి అడగకు’, ‘బచ్చల మల్లి’ వంటి సినిమాలు అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయిన సరే, కొత్త కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటా అంటూ, ఇప్పుడు ’12A రైల్వే కాలనీ’ అనే ఒక క్రేజీ థ్రిల్లర్‌తో నరేష్ మన ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాకు ‘పొలిమేర 1 & 2’ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన. అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే అందించడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అలాగే, ఆ పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తోంది. నాని కాసరగడ్డ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.ఇక రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మూవీ టీం.
ALSO READ: Weekend: బాక్సాఫీస్ హీట్ పెంచబోతున్న నవంబర్ 14 రిలీజ్‌లు!
ట్రైలర్ ఎలా ఉంది?
’12A రైల్వే కాలనీ’ ట్రైలర్ ఫుల్ టెన్షన్‌తో, సస్పెన్స్తో ఉంది. నరేష్ పాత్ర కొంచెం కన్ఫ్యూజన్‌గా, ఏదో మిస్టరీలో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. తను చూస్తున్నవి నిజమా, లేక తన భ్రమా అనే డౌట్ మనకు వస్తుంది. సాయి కుమార్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపిస్తూ, ఈ మిస్టరీ సాల్వ్ చేయడంలో నరేష్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం ఆసక్తి పెంచింది.
భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఓవరాల్‌గా, ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. ఈ సినిమాతో అల్లరి నరేష్‌కు మంచి హిట్ దొరికే ఛాన్స్ ఉంది.


