Aamir Khan: ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్ ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోన్న సినిమాల్లో కూలీ ఒకటి. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టాలీవుడ్ హీరో నాగార్జున విలన్‌గా నటిస్తుండగా… బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ ఓ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. వీరితో పాటు కన్నడ అగ్ర హీరో ఉపేంద్ర, మలయాళ యాక్టర్ సౌబీన్ షాహిర్ కూడా కూలీలో నటిస్తున్నారు.
కోలీవుడ్ ఎంట్రీ…
కూలీ మూవీతోనే ఆమిర్‌ఖాన్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దహా అనే క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి కాదు. ముప్పై ఏళ్ల క్రితం ఈ స్టార్ హీరోల కాంబినేషన్‌లో ఆటాంక్ హై ఆటాంక్ అనే బాలీవుడ్ మూవీ రూపొందింది.
Also Read – Naga Chaitanya: బుల్లితెరపై అదరగొట్టిన తండేల్ – నాగచైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ టీఆర్‌పీ!
గాడ్‌ఫాదర్ స్ఫూర్తితో…
హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ గాడ్‌ఫాదర్ స్ఫూర్తితో వచ్చిన ఆటాంక్ హై ఆటాంక్ 1995లో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జూహీ చావ్లా హీరోయిన్‌గా నటించింది. అప్పటివరకు లవర్‌బాయ్‌గా, సాఫ్ట్ రోల్స్ చేసిన ఆమిర్‌ఖాన్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఓ మాస్ రోల్‌లో ఆటాంక్ హై ఆటాంక్ మూవీలో కనిపించాడు. మాఫియా డాన్‌గా తన యాక్టింగ్, లుక్ విషయంలో వేరియేషన్ చూపిస్తూ ప్రయోగాత్మకంగా ఈ మూవీ చేశాడు.
నటించి తప్పు చేశా…
ఆమిర్‌ఖాన్ ఒకటి ఊహిస్తే ఆడియెన్స్ నుంచి రిజల్ట్ మాత్రం మరోలా వచ్చింది. ఆతంక్ హై ఆతంక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఆమిర్‌ఖాన్ యాక్టింగ్, లుక్ విషయంలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. చివరకు ఈ సినిమాలో నటించి తప్పు చేశానని ఆమిర్‌ఖాన్ స్వయంగా ఒప్పుకున్నాడు. తన కెరీర్‌లో రిగ్రేట్‌గా ఫీలైన మూవీ ఇదే అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.
Also Read – Ktr fires on bjp: బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం: తెలంగాణ ఉనికిని విస్మరిస్తున్నారా?
తమిళంలో సేమ్ రిజల్ట్…
ఆతంక్ హై ఆతంక్ మూవీని ఆంధవాన్ పేరుతో తమిళంలోకి డబ్ చేశారు. ఇక్కడ సేమ్ రిజల్ట్ వచ్చింది. దిలీప్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి బప్పిలహరి మ్యూజిక్ అందించాడు. ఆటాంక్ హై ఆటాంక్ మూవీ తర్వాత దాదాపు ముప్పై ఏళ్ల లాంగ్ అనంతరం రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ కలిసి కూలీ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కూలీ మూవీని సన్ పిక్సర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది.


