The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ప్యారడైజ్ మూవీ ఆరంభం నుంచే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్యారడైజ్ కోసం నాని చాలా మేకోవర్ అయ్యారు. కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన మాస్ క్యారెక్టర్లకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. జడల్‌గా నాని లుక్, క్యారెక్టరైజేషన్, బాడీలాంగ్వేజ్, యాటిట్యూడ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. నాని ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ప్యారడైజ్ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే మోహన్‌బాబు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. శికాంజా మాలిక్ అనే క్యారెక్టర్‌లో మోహన్‌బాబు కనిపించబోతున్నట్లు వెల్లడించారు. లాంగ్ గ్యాప్ తర్వాత ప్యారడైజ్ మూవీతో విలన్‌గా మోహన్‌బాబు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో నానికి ధీటుగా మోహన్‌బాబు క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా సాగుతుందని సమాచారం.
ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏడున్నర కోట్లతో మోహన్‌బాబు ఇంటి సెట్‌ను వేస్తున్నారట. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండియర్‌గా ఈ సెట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఫలక్‌నుమా ప్యాలెస్‌ను పోలి చాలా లావిష్‌గా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ సెట్‌ను డిజైన్ చేసినట్లు చెబుతోన్నారు. ప్యారడైజ్ మూవీకి ఈ భారీ సెట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని అంటున్నారు.
ఈ హౌజ్ సెట్‌లో నాని, మోహన్‌బాబుతో పాటు హీరోయిన్ కయదు లోహర్‌పై డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. దాదాపు నెల రోజుల పాటు నెక్స్ట్ షెడ్యూల్ సాగనున్నట్లు సమాచారం. జనవరి 1న ప్యారడైజ్ నుంచి మరో అప్‌డేట్ ఉండబోతున్నట్లు సమాచారం. స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ వీడియో గ్లింప్స్‌లో నానితో పాటు మోహన్‌బాబు కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దాదాపు 150 కోట్లతో ప్యారడైజ్ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. 2026 మార్చి 26న ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ కాబోతుంది. అదే టైమ్‌లో రామ్‌చరణ్ పెద్దితో పాటు యశ్ టాక్సిక్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దాంతో ప్యారడైజ్ పోస్ట్‌పోన్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పోస్ట్‌పోన్‌పై మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన దసరా మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
Also Read- Kajal Aggarwal: చందమామ గ్లామర్‌కు హద్దులే లేవు.. రెడ్ డ్రెస్ లుక్ వైరల్!


