Homeచిత్ర ప్రభAadi Saikumar: ఆది సాయికుమార్ హీరోగా డివైన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ

Aadi Saikumar: ఆది సాయికుమార్ హీరోగా డివైన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ

Aadi Saikumar: ఆది సాయికుమార్ హీరోగా త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ భారీ సినిమా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డివైన్ మిస్టరీ, సస్పెన్స్ తో కూడిన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనుంది. ప్రొడక్షన్ నంబర్ 3గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ జి. రుద్రప్ప నిర్మిస్తున్నారు. నవరసన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దైవిక రహస్యాల నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. ఆధ్యాత్మికత, విశ్వాసం, ప్రాచీన నమ్మకాలు, అంతుచిక్కని రహస్యాలతో కూడిన విభిన్నమైన సినీ ప్రపంచాన్ని పరిచయం చేయనుంది.

- Advertisement -

అద్భుతమైన కథనం, బలమైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించడమే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ డార్క్, మిస్టరీ వాతావరణంతో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అతీంద్రియ రహస్యాలతో ముడిపడిన కథను ఈ పోస్టర్ సూచిస్తోంది. పోస్టర్ మధ్యలో త్రిశూలం చుట్టూ చుట్టుకుని, పడగ విప్పిన భారీ నాగుపాము అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. దాని చుట్టూ కత్తులు, గొడ్డళ్లు, ఈటెలు, అర్ధచంద్రాకారంలో ఉన్న ఆయుధం, గద వంటి ప్రాచీన ఆయుధాలను అమర్చారు. ఇవి పోస్టర్‌కు మరింత గంభీరమైన, భయానకమైన రూపాన్ని అందిస్తున్నాయి. ఈ సినిమా నెక్స్ట్ అప్‌డేట్‌ను అక్టోబర్ 20, 2026న వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కాంతార’, ‘విరూపాక్ష’, ‘మంగళవారం’ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News