Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభAshika Ranganath: మళ్ళీ సంక్రాంతికి రెడీ అవుతున్న గ్లామర్ బ్యూటీ!

Ashika Ranganath: మళ్ళీ సంక్రాంతికి రెడీ అవుతున్న గ్లామర్ బ్యూటీ!

Ashika Ranganath: ఆషిక రంగనాథ్.. ఇప్పుడు సౌత్‌లో అటు ప్రేక్షకులను, ఇటు మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంటున్న బ్యూటీ. అందం మాత్రమే కాకుండా, మంచి పర్ఫార్మెన్స్ అలాగే, గ్లామర్ రోల్స్ చేయడానికి వెనకాడని దూకుడు, ఆషికాకి వరుసగా అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. ముందు సినిమా నుంచి ఈ హీరోయిన్ మీద అందరికీ పాజిటివ్ ఒపీనియనే ఉంది. అమిగోస్, నా సామిరంగ సినిమాలతో తెలుగులో బాగా గుర్తింపు తెచ్చుకుంది.

- Advertisement -

దాంతో యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీలోనూ ఓ హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌కి నటిస్తోంది. అయితే, ఈ సినిమా కంటే ముందే గత వైభవం అలాగే, ఈ సంక్రాంతికి రవితేజ సరసన నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆషికా రంగనాథ్‌కి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో తన అందాల ఆరబోత ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయింది.

Also Read – Sharwanand: తండ్రీకొడుకులుగా శర్వానంద్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

ఈ మధ్యకాలంలో ఏ భాషలో కూడా మన స్టార్స్ కి సరైన జోడీగా హీరోయిన్ కుదరడం లేదు. ఇప్పుడు, ఆషికా రంగనాథ్ ఆలోటును తీర్చడానికి ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారింది. తమిళంలో కూడా, కొత్త హీరోయిన్స్ కోసమే చూస్తున్నారు. ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్ అందరూ ప్రేక్షకులకు బోర్ కొట్టేశారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆషికా లాంటి గ్లామర్ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం తెలుగులో మరో సినిమాను కమిటైనట్టుగా తెలుస్తోంది.

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ సినిమాను చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందని తెలుస్తోంది. ఇందులో హీరోగా శర్వానంద్ నటించనున్నాడని, ఆ హీరోకి జంటగా ఆషికా రంగనాథ్‌ను మేకర్స్ ఎంపిక చేశారనేది ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్త. అంతేకాదు, ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని కూడా ఫిక్సైయ్యారట. శ్రీను వైట్ల సినిమాలలో హీరోయిన్‌కి మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర ఉంటుంది. సమంత, జెనీలియా, త్రిష లాంటి క్రేజీ హీరోయిన్స్ శ్రీను డైరెక్షన్‌లో చేశి హిట్స్ అందుకున్నారు. కాబట్టి, శ్రీను వైట్ల – శర్వా సినిమాలో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్ ఛాన్స్ దక్కించుకుంటే ఖచ్చితంగా మంచి రోల్ అయ్యేందుకు అవకాశం ఉంది. చూడాలి, దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.

Also Read – Dimple Hayathi: నాకింకా పెళ్ళి కాలేదు.. షాకిచ్చిన డింపుల్ హయాతి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News