Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ గుడ్ న్యూస్ చెప్పాడు. పదేళ్ల తర్వాత తన బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ ని ప్రకటించాడు. ఆమిర్ ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘3 ఇడియట్స్’. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. తాజాగా ‘3 ఇడియట్స్’ సినిమా సీక్వెల్ పనులు మొదలయ్యాయని ఆమిర్ ఖాన్ తెలిపారు.
ఈ సీక్వెల్ గురించి ఓ ఆంగ్ల మీడియాతో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘3 ఇడియట్స్’కి సీక్వెల్ చేయనున్నాం… కథ విన్నాను. నాకు నచ్చింది. మొదటి భాగంలో ఉన్న ప్రధాన పాత్రధారుల జీవితాల్లో పదేళ్లు గడిచిన తర్వాత ఏం జరుగుతుంది? అనే అంశంతో సీక్వెల్ కథ ఉంటుంది. అలాగే తొలి భాగంలోని కామెడీ కంటిన్యూ అవుతుంది. దర్శకుడు రాజ్ ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతూ స్క్రీన్‌ప్లేను సెట్ చేసే పనిలో ఉన్నారు‘ అని పేర్కొన్నారు.
Also Read: Drishyam 3 Teaser: మోహన్ లాల్ ‘దృశ్యం 3’ టీజర్ వచ్చేసింది

