Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం బెంగళూరులోని వారి స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఆమె మరణంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరులో అంత్యక్రియలు
ఈ కఠిన సమయంలో ఆయనకు, తన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పోస్ట్స్ చేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు, దర్శక-నిర్మాతలు ప్రకాశ్ రాజ్ ఇంటికి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Fahadh Faasil: విలన్ పాత్రల కోసం రూ. 20 కోట్లు డిమాండ్.. నిర్మాతలను వణికిస్తున్న ఫహద్
కాగా ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రకాశ్ రాజ్. నటుడిగానే కాదు దర్శకుడు, నిర్మాత, టీవీ హోస్ట్ , రాజకీయ నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. నటుడిగా తన సినీ కెరీర్‌లో ప్రకాశ్ రాజ్ 5 జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు 8 నంది పురస్కారాలు, 8 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, 6 ఫిలింఫేర్ పాటు 4 సైమా, 3 సినిమా పురస్కారాలు, 3 విజయ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

